PUBLISHED: MON,FEBRUARY 15, 2016 12:23 AM
వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచనలను ప్రజలకు చేరవేయడానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో అంబేద్కర్ పేరిట ఓ వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలని నిర్ణయించింది. దీనిద్వారా అంబేద్కర్ రచించిన ఇంగ్లిష్, మరాఠీ రచనలను 9భాషల్లోకి అనువదించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయన పూర్తి రచనలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్టు మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ పోర్టల్‌ను వచ్చే నెల మార్చిలో ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి