బాబాసాహెబ్ భారతమిదేనా ?
సాంఘిక విప్లవమూర్తి, నవభారత నిర్మాత, భారతదేశ మార్గదర్శి, మహోన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం, సమున్నత విలువలకు నిలువెత్తు రూపం విశ్వరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్. అవినీతి, అరాచకం, అన్యాయం రాజ్య మేలుతున్న ఈ తరుణంలో అంబేద్కర్ ఆశయాలు ,ఆదర్శాలు, విలువలు ఈ సమాజాన్ని మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయి. మరింత పక్కా ప్రణాళికతో అంబేద్కరిజాన్ని ఈ సమాజానికి అందించాలి. అంటరాని కుటుంబంలో జన్మించినా, అన్నిరకాల అసమానతలు, బానిస, వివక్ష సంకెళ్ళను తెంచుకుని ఆయన ఎదిగిన క్రమం ఏ తరానికైనా నిత్య స్ఫూర్తే. తన ఆశయ సాధనలో ఏ రోజూ ఆయన తను నమ్మిన విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు. ఆత్మగౌరవానికే ప్రాధాన్యత ఇచ్చి ...కేవలం పదవి కోసమే ...కుట్రలు పన్నే వారి కుయుక్తులకు ఎంతో దూరంగా ఉన్నారు. ఇలాంటి మహనీయుని జీవిత మార్గం రేపటి ఆధునిక భారతానికిి కూడా ఎంతో ఆవశ్యకం.
అయన వాదం అంబేద్కర్ వాదం, అది విశ్వజనీనం, అది ఆదర్శవాదం, మానవవాదం, నిరంతర వాదం, ఈ భారతంలో అంబేద్కర్‌కి సరైన న్యాయం జరగలేదు.అంబేద్కర్ వాదమే సరైనదని, ఆయన ప్రతిపాదించిన ప్రజాస్వామ్యమే ఆచరణీయమని ప్రపంచమంతా చాటిచెబుతూ, దాని ఆచరణకై అన్ని రకాల మార్గాలను శోధిస్తున్న ఈ సమయంలో నిజంగా అంబేద్కర్ వాదులమని చెప్పుకునే కొందరు అనుసరిస్తున్న మార్గాలు,గమ్యాలు మాత్రం అగమ్యగోచరంగా తయారయ్యాయి.ఇలాంటి విపరీత ధోరణి, మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారని,ఇలాంటి వారి వల్ల ఈ దేశానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆనాడే అంబేద్కర్ ఎంతో ఆవేదనతో ఆగ్రా ఉపన్యాసంలో పేర్కొన్నారు.
ఆయన చెప్పినది ఆయన మాటల్లోనే .......'చదువుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. విద్యావంతులలో కొంత అభివృద్ధి ఉంది. విద్య వల్ల కొందరు ఉన్నత స్థ్తానాలకు ఎదిగారు. కాని ఈ విద్యావంతులే నన్ను మోసం చేశారు. వీరు ఉన్నత విద్యావంతులైన తరువాత ఈ సమాజానికి సేవ చేస్తారని అనుకున్నాను. కానీ చిన్నా, పెద్దా అంతా పోగై వారి వారి కుటుంబాల బాగోగులు మాత్రమే చూసుకుంటున్నారు'. 1956 మార్చి 18న తన చారిత్రక ఆగ్రా ఉపన్యాసం లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవేదన ఇది. ఈ ఉపన్యాసం అంతా.... రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఎదిగిన ప్రభుత్వ ఉద్యోగుల స్వార్థ పూరిత విధానాలను,వారు అణగారిన వర్గాలకు ఏమాత్రం ఉపయోగపడకుండా ఉన్నారన్న వారి సంకుచిత దృక్పథాన్ని స్పష్టంగా వివరిచింది.ఇదే ఉపన్యాసంలో అంబేద్కర్ వివిధ వర్గాలకు వివిధ ఉద్దేశాలను కర్తవ్యాలను తీవ్ర ఆవేదనతో నిర్దేశించారు.
ముఖ్యంగా సామాన్య ప్రజానీకానికి..... విద్యా, ఆర్థిక, సామాజిక అసమానతల విముక్తి కోసం ఎన్ని త్యాగాలైన చేయాలనీ, అవసరమైతే తమ జీవితాలను కూడా త్యాగం చేయాలనీ కోరారు. ఇక రాజకీయ నాయకులకు ఉద్దేశించి .....'నిన్ను నీవు అమ్ముకుంటే అంతకంటే మోసం మరొకటుండదు. నాకు ఎవ్వరివల్ల లేని భయం మీవల్లనే ఉంది' అని ఆవేదన చెందారు. ఉద్యోగులు కచ్చితంగా కనీసం 20% సంపాదనను ఈ సమాజం బాగు కోసం వెచ్చించాలని, రిజర్వేషన్‌ను ఉపయోగించుకొని పొందిన ఉద్యోగం ...అదే జాతి ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగించాలి. పేద ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటూ, అణగారిన వర్గాల ప్రతినిధిగా బాధ్యత వహించాలి తప్ప ,రిజర్వేషన్ ఫలానాను నీరుగారుస్తూ, అగ్రవర్ణ ఆధిపత్య నాయకుల చెప్పుచేతుల్లోకి వెళ్లి, అవినీతి అధికారులుగా, జాతికి వెన్నుపోటు పొడవరాదని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థులు, యువకులను ఉద్దేశించి, '... గుమస్తా ఉద్యోగాల లాంటివి చేయకుండా, ఎవరెవరి గ్రామాలలో వారు నిస్వార్థ సేవ చేయాల'ని సూచించారు.ఉన్నత ఉద్యోగాల్లో భాగ్యస్వాములు కావాలని కోరారు.ఈ క్రమం లో భాగంగానే అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగానే కాన్షీ రామ్ స్థాపించిన (మైనారిటీ ఉద్యోగుల సమాఖ్య) సంస్థ కూడా ఉద్యోగుల చేత ,ఉద్యోగుల కొరకే పనిచేసింది తప్ప సమాజంకోసం పనిచేయలేదు. కాన్షీరామ్ ఉన్నంతవరకూమాత్రమే అది బాగా పని చేసింది. ఇక డిసెంబర్ 6 మరియు ఏప్రిల్ 14 సంప్రదాయ దినాలుగా, ఏప్రిల్ మాసమంతా ఒక పవిత్ర మాసంగా పరిగణించడానికి, కేవలం పూలమాలలు వేసి,పెద్ద పెద్ద గాలి మాటలు మాట్లాడి చేతులు దులుపుకునే రోజులుగా తయారయ్యాయి.
నిజమైన అంబేద్కర్ వాదాన్ని అవలంబిస్తే ఈ దేశంలో బ్రతకలేమని ,నిజమైన అంబేద్కర్ వాదం ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో సాధ్యం కాదని వారు పేర్కొంటున్నారు.
సుదీర్ఘ కాలం అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వారు ఏమి సాధించారని ?అంబేద్కర్ వాదాన్ని తప్పుదోవ పట్టించి,తమకు అనువైన రీతిలో ఆయన వాదాన్ని మలుచుకుని, నకిలీ వాదులుగా తయారయ్యారు. నిజమైన అంబేద్కర్ వాదులవల్ల జరిగిన సమాజ మార్పును చూస్తే తెలుస్తుంది అసలు ఆ వాదమేమిటో. రెండు మూడు లక్షల జనాభా ఉన్న దేశాలే కలిసి మెలిసి ఉండలేక ,తమకు ఏ రాజ్యాంగం కావాలో నిర్ణయించుకోలేక (నేపాల్),తమలో తామే కొట్టుకుంటూ,దేశ ఐకమత్యం మిథ్యగా తయారవుతున్న ఈ కాలం లో కూడా ....ఇన్ని జాతులు,ఇన్ని కులాలు, ఇన్ని వివక్షలు ఉన్న ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అవలంబించబడుతుంది అంటే అదిఅ ంబేద్కర వాదం వల్లే. ఈ దేశం ముక్కలు కాకుండా ఉంది అంటే...ఇంకా.......
మనుధర్మ శాస్త్రాన్ని తప్ప ఇంకో శాస్త్రాన్ని అంగీకరించని దేశ ప్రధానమంత్రి సైతం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగమే అత్యున్నత గ్రంథమని, దానివల్లనే ఈ దేశం శోభిల్లుతుందని కితాబిచ్చాదంటే అది కేవలం అంబేద్కర్ పోరాటాల వల్ల ,అంబేద్కర్ వాదం వల్ల మాత్రమే. .2000 ఏళ్ళు మనుధర్మ శాస్త్ర భావనియంత్రణలో ఉన్న భారతదేశం లో ఇంతకంటే ఎక్కువ ఎం కావాలి?ఇంతకంటే ఎక్కువ సాధించాలన్నా, అది కేవలం అంబేద్కర్ వాదం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.మరే ఇతర మార్గం ,మరే ఇతర వాదం, అంబేద్కర్ వాదానికి సాటిరాదు..అంబేద్కర్ వాదం అద్వితీయమైనదని చెప్పక తప్పదు.అయన వాదం ఎంత సంఘర్షణలతో కూడుకున్నతో అంత ఆకర్షణీయమైనది .
అంబేద్కర్‌కు
ఎప్పుడూ, ఏ పదవి పైనా వ్యామోహం లేదు. సంపద ఉన్నా లోభం లేదు. దేశంలోని ఉన్నతమైన పదవులు ఆయనిక లభించాయి. హైకోర్టు న్యాయమూర్తి పదవి ఆయనికి రాబోయింది.రాష్ట్రపతిగా కూడా ఆయన పేరు చర్చకి వచ్చింది. కాని ఆయన ఎప్పుడు ఏ పదవుల కోసం ఆకాంక్షించలేదు.అయినా కూడా భారతదేశ అత్యున్నత గౌరవ శిఖరాన్ని చేరారు.అయిన కూడా ఈ దేశ ప్రజానీకానికి కావలసినదాని కంటే ఎక్కువే చేశారు. అంబేద్కర్ చిన్న రాష్ట్రాలకు అనుకూలమని, వాటిని కోరుకున్నాడని ...అంబేద్కర్ పేరును తెలంగాణా ఉద్యమ సమయంలో విపరీతంగా ప్రస్తావించిన తెలంగాణా వాదులు ...నేడు అదే అంబేద్కర్ ఆశయాలను విరుద్ధంగా అంటే ఆగమశాస్త్రం ప్రకారం పాలన సాగించడం, మహిళలకు మంత్రివర్గం లో స్థానం ఇవ్వకపోవడం, పోలీసు వ్యవస్థ్తను ప్రోత్సహిస్తూ ఎన్‌కౌంటర్లు చేయించడం, వంటి అప్రజస్వామిక చర్యలకు పాల్పడుతోంది. తెలంగాణా ప్రభుత్వంలో ఉంటూ అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వారు వీటిని ఎందుకు ప్రశ్నించరు? ఏ పార్టీలో ఉన్న ,ఏ ప్రాంతంలో వున్నా .. అంబేద్కర్ వాదం ఒకేలాగ ఉంటుంది తప్ప ..పార్టి పార్ట్టీకి అంబేద్కర్ వాదం మారదు. ఇంకా అంబేద్కర్ వాడులమంటూ,మేమే అంబేద్కర్ జయంతులను నిర్వాహిస్తామంటే ....అంబేద్కర్ ఆశించిన నైతికత ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వారి వల్ల అంబేద్కర్ ఆశయానికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు.
ఇక ఇప్పుడు దళితులల్లో నయా దళితవాదులు బయలుదేరారు.ఇదివరకే ఉన్న సంప్రదాయ అంబేద్కర్ వాదులను ఏ మాత్రం లెక్కచేయకుండా, ఏదో కొంత ఆర్థిక స్థిరత్వం, ఆధునిక వస్త్రాధారణ సాధించినత మాత్రాన ....మిగతా అంబేద్కర్ వాదులను మరింత అంటరానివారిగా చూస్తూ, అగ్రవర్ణాల మెప్పు పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇలాంటి వారి వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు.ఇంకా ఇదే దేశంలో కొందరు వారి వారి అధికారిక ఆఫీసుల్లో అంబేద్కర్ ఫొటోను పెట్టుకోవాదానికి జంకుతున్నారు. అగ్రవర్ణాలు తనను అంబేద్కర్ వాది అనుకుంటారేమోనని, దళితుడు అని గుర్తుపట్టి అంటరానివారిగా చూస్తారేమో అని,భయపడుతున్నారు.ఇంత అనాగరికంగా ఆలోచిస్తే ఇక స్వేచ్ఛ ఎక్కడున్నట్టు ? స్వతంత్రం ఎలా వచ్చినట్టు,,,,,,? ఇంకా అంటరానితనం ఎలా రూపుమాపబడినట్టు? అంబేద్కర్ ఫొటో పెట్టుకోవడమంటే దళితుడిగా .అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక సైనికుడిగా చెప్పుకునే ఒక గొప్ప అవకాశాన్ని పొందడం.అంబేద్కర్ వాదమంటే కేవలం ఎదో ఒక కులానికి ,మతానికి,జాతికి చెందినది కాదు. అంబేద్కర్ వాదం మానవవాదం,విశ్వజనీనం. ఆదునిక భారత నిర్మాణమే మన ప్రజాస్వామ్య లక్షణం,లక్ష్యం కూడా.నిజంగా ఆ దిశగానే మనం ఉన్నామా? ఆ దిశగానే మనం ప్రయానిస్తున్నామా? ఆ దిశ గానే ఆలోచిస్తున్నమా?? ఆ దిశ గానే మన దృక్పథాలు ఉన్నాయా అనేది ఒక్కసారి పునఃపరిశీలించుకోవాలి..మనం ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తున్నమో ,నిర్మించాబోతున్నామో మనకే అవగతమవుతుంది.
ఇదే క్రమంలో నేడు భారతదేశంలో సంస్క�ృతి పేరుతో జరుగుతున్న వికృత చేష్టలను గమనిస్తే ...అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్యానికి ,మానవత్వ భారత్ కి మరింత దూరంగా జరుగుతున్నామని అర్థమవుతుంది .స్త్రీలు వంతగదికే పరిమితమవ్వాలనడం ఒకప్పటి నియమం.అది మన సంస్క�ృతి అంటున్నారు. ఇలాంటి నిర్జీవ సంస్క�ృతి ఇంకా స్త్రీ లపై ఎన్నో రకాలుగా వివక్ష ను కొనసాగిస్తూనే వుంది..సంస్క�ృతి ప్రజాస్వామ్యబద్ధ సంఘ నిర్మాణానికి అతీతమైనది కాదు. కృత్రిమ విభేదాలకు అతీతమై,సమానత్వం ,సమానావకాశాలు ప్రతిపదికగాగల రాజ్యంగబద్ధంగా ఉండేదే అంబేద్కర్ ఆశించిన భారతం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి